పండగలా చేసుకునే తెరాస ఆవిర్భావ వేడుకలను కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిరాడంబరంగా జరుపుకోవడం బాధాకరమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ రూరల్ పర్వతగిరిలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో కలిసి ఎర్రబెల్లి పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ప్రజలకు మాస్కులు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: గవర్నర్ తమిళిసైతో భాజపా ప్రతినిధుల బృందం భేటీ