ETV Bharat / state

యువకులతో క్రికెట్ ఆడిన మంత్రి ఎర్రబెల్లి - యువకులతో క్రికెట్​ ఆడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

నిత్యం రాజకీయాలు.. పర్యటనలతో బిజీబిజీగా గడిపే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాసేపు సరదాగా గడిపారు. వరంగల్ గ్రామీణ జిల్లా కల్లెడ గ్రామంలో యువకులతో కలసి క్రికెట్ ఆడారు. వారితో ముచ్చటించిన ఆయన యువత అన్ని క్రీడల్లో రాణించాలని సూచించారు.

Minister Errabelli dayakar rao  playing cricket with youngsters in warangal rural district
యువకులతో క్రికెట్ ఆడిన మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Jan 26, 2021, 6:50 AM IST

యువత అన్ని క్రీడల్లో రాణించి విజయాలు సాధించాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా కల్లెడ గ్రామంలో క్రికెట్ ఆడుతున్న యువకులను కలిసిన ఆయన వారితో సరదాగా మాట్లాడారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి తన నివాసనికి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గం మధ్యలో కల్లెడ గ్రామంలో క్రికెట్ ఆడుతున్న యువకుల వద్దకు చేరుకొని వారితో కలిసి ఆటలో పాల్గొన్నారు. మంత్రి తమతో క్రికెట్ ఆడడం పట్ల ఆశ్చర్యపోయిన యువకులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: 'వారికి రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లేవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.