వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి పర్యటించారు. అన్ని మున్సిపాలిటీల్లో తెరాస జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి భాజపా ఒక పైసా నిధులు ఇవ్వకున్నా ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాత్రం ప్రభుత్వంపై బురుద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఏడాది క్రితమే మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉన్న కేసులు వేసి జరగకుండా చేశారన్నారు. పురపాలక నూతన చట్టం తీసుకొచ్చి వార్డుల అభివృద్ధికి కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేయడంలో విఫలమైన కౌన్సిలర్లను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేశామని గుర్తు చేశారు.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్నగర్ కార్పొరేషన్