ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అంటారు. ఏమి చేసినా తల్లి రుణం తీర్చుకోలేనిదంటారు. అయినా ఎంతో కొంత చేయాలనే సంకల్పంతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు స్వగ్రామంలో సేవలందిస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి ఆయన పుట్టిన ఊరు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయానికి అనుగుణంగా ఇంటి వద్దే ఉంటూ పరిమితి మేరకు ఊర్లో పర్యటిస్తూ... ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
పర్వతగిరిలోనే ఉంటూ జిల్లావ్యాప్తంగా పర్యటిస్తున్నారు ఎర్రబెల్లి. అధికారులతో సమీక్షిస్తూ... సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజల్ని చైతన్య పరుస్తూ... నేనున్నా అనే భరోసా కల్పిస్తున్నారు. వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్ రసాయనం పిచికారి చేస్తూ... ఇంటింటికీ మాస్కులు అందిస్తూ... జాగ్రత్తలు చెబుతున్నారు. ప్రభుత్వం అందించే బియ్యం పంపిణీపై ఆరా తీస్తున్నారు. కరోనా కట్టడికి స్వీయ నియంత్రణే ముఖ్యమన్న ఎర్రబెల్లి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్డౌన్ నిర్ణయం చాలా గొప్పదని కొనియాడారు.
ఇదీ చూడండి: కరోనాపై పోరాటానికి రామోజీ సంస్థల భారీ విరాళం