తలుగు పారా పట్టి కూలీలతో కలిసి మట్టిపని చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరలోని ఆవుకుంట చెరువులో ఉపాధి హామీ కూలీ పనులను ఆయన పరిశీలించారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ... పనులు చేయాలని సూచించారు. వాళ్లకు మాస్కులు పంపిణీ చేశారు.
ఉపాధి హామీ పనులు విషయమై జిల్లా కలెక్టర్ హరితతో మంత్రి మాట్లాడారు. ఎక్కువ మందికి పనులు కల్పించేలా చూడాలని కోరారు. ప్రతి వ్యక్తికి రోజుకు కనీసం రూ.200 వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.
ఇదీ చూడండి: తెల్లారేసరికి 'కూలీ'న బతుకులు- నిద్దట్లోనే అనంతలోకాలకు