దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 92 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ధర్మ సాగర్ రిజర్వాయర్ దక్షిణ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. దీని వల్ల స్టేషన్ ఘన్పూర్, వర్దన్నపేట, పరకాల నియోజక వర్గాల్లోని 33 గ్రామాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఇక ఉచితంగా 'ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్' పాఠాలు!