భాజపా ఉద్యమ ఫలితంగానే ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంపై రాష్ట్రపతి స్పందించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. వరంగల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అధికారుల తప్పిదాల ఫలితంగా 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. ఒంటెద్దు పోకడలకు పోతూ.. తెలంగాణ ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటే రాయలసీమను రతనాల సీమను చేస్తానని ముఖ్యమంత్రి చెప్పడాన్ని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెరాసలో చేరకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని ఉత్తమ్.. భాజపాను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇదీ చూడండి: వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు...