కరోనాపై పోరుకు ప్రభుత్వానికి పలువురు విరాళాలు అందజేస్తూ దాతృత్వాన్ని చాటుతున్నారు. వరంగల్ జిల్లా కాకతీయ స్టోన్ క్రషర్స్ సంక్షేమ సంఘం రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించింది. చెక్కుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలోని తన నివాసంలో అందజేశారు.
లాక్డౌన్ సమయంలో దాతలు ముందుకొచ్చి విరాళాలివ్వడం అభినందనీయమని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. కష్టాల్లో వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదీ చూడండి: భళా ఈశాన్య భారతం- కరోనా రహితంగా ఆ ఐదు రాష్ట్రాలు