గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలు రేకెత్తించి.. వారిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, ఇన్నోవేటివ్ సెల్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్తంగా 'ఇన్నోవేషన్ యాత్ర'ను చేపడుతోంది. ఈనెల 19న వరంగల్‌లో ప్రారంభమైన ఈ యాత్ర పరకాలలోని గ్రామ సైంటిస్ట్ మహిపాల్ చారి ఇంటికి చేరింది.
మహిపాల్ చారి రైతులకు ఉపయోగపడేలా రూపొందించిన 'పవర్ ట్రిల్లర్' పరికరాన్ని చూసి ఇన్నోవేషన్ విద్యార్థులు ఆశ్చర్యపోయారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిపాల్ చారి లాంటి మేధావుల నుంచి తాము ఎంతో నేర్చుకున్నామని విద్యార్థులు చెప్పారు. ఇన్నోవేషన్ యాత్ర చేపట్టడానికి తాము సెలెక్ట్ అవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
చదువు రాని ఒక వ్యక్తి ప్రజలకు ఉపయోగపడే యంత్రాలను తయారు చేస్తుంటే.. అతన్ని ఆదర్శంగా తీసుకొని తాము చదువుకున్న చదువుకి సరైన న్యాయం చేస్తామని ఈ దేశానికి ఉపయోగపడేలా తమ వంతు కృషి చేస్తామని విద్యార్థులు అన్నారు.
ఇదీ చూడండి: ట్రంప్‌కి గుడికట్టి పూజలు చేస్తున్న వీర భక్తుడు