ETV Bharat / state

పంటలు నష్టపోతే వెంటనే ఫోన్​ చేయండి - crop loss

వరంగల్‌ పట్టణ, గ్రామీణ జిల్లాల్లో పంటలు బీమా చేసుకున్న రైతులు..నష్టం వాటిల్లితే సమాచారం అందించాలని జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్‌ తెలిపారు. బీమా సంస్థ, స్థానిక వ్యవసాయ అధికారులకు ఫోన్​చేసి వివరాలు ఇవ్వాలన్నారు.

If crops are damaged, phone immediately
పంటలు నష్టపోతే వెంటనే ఫోన్​ చేయండి
author img

By

Published : Apr 13, 2020, 12:21 PM IST

పంటల బీమా చేసుకున్న వరంగల్‌ పట్టణ, గ్రామీణ జిల్లాల రైతులు వడగళ్ల వర్షంతో పంటలు నష్టపోతే వెంటనే బీమా సంస్థ, స్థానిక వ్యవసాయాధికారులకు సమాచారం అందించాలని జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్‌ సూచించారు. హన్మకొండలోని జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో పలువురు అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

వర్షంతో పంటలు నష్టపోయిన మూడు రోజుల్లోపు సంబంధిత బీమా సంస్థ, లేదా నేరుగా వ్యవసాయాధికారుల ద్వారా సమాచారం పంపించాలన్నారు. టోల్‌ఫ్రీ నెంబర్ 1800 599 2594కు ఫోన్‌ చేసి నష్టం సమాచారాన్ని తెలపాలని సూచించారు. రబీలో పంటలకు బీమా చేసుకున్న రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు.

ఇదీ చూడండి : యుద్ధాలు అవసరం లేదు.. ఈమూడు పాటించండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.