ETV Bharat / state

Warangal Rains: వరంగల్​లో కుండపోత వర్షం... జనజీవనం అస్తవ్యస్తం

author img

By

Published : Jul 11, 2021, 5:34 PM IST

వరంగల్​పై వరణుడు ప్రతాపం చూపించాడు. కుండపోతగా కురిసిన వర్షం కారణంగా నగరం నీటితో నిండిపోయింది. పలు కాలనీలు వరద నీరుతో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే వినయ భాస్కర్ పరిశీలించారు.

rains
వరంగల్​
Warangal Rains: వరంగల్​లో కుండపోత వర్షం... జనజీవనం అస్తవ్యస్తం

వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. వరంగల్ నగరంలో ఉదయం నుంచి కురిసిన వర్షానికి జలమయమైన కాలనీలను ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ పరిశీలించారు. హన్మకొండలోని బ్యాంక్ కాలనీ, సమ్మయ్యనగర్, వడ్డేపల్లి, తదితర ప్రాంతాలను పరిశీలించారు.

వర్షం పడినప్పుడల్లా కాలనీలు మునిగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే వినయభాస్కర్​కు స్థానికులు గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. వెంటనే రూ. 3 కోట్లు కేటాయించారని... త్వరలోనే శాశ్వత పనులు జరుగుతాయని తెలిపారు. నగరవాసులకు వరద నీరు నుంచి విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు.

నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కుండపోత వాన కురవడం వల్ల జనావాసాలన్నీ నీటితో నిండిపోయాయి. నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట వీధి మొత్తం వర్షపు నీటితో పొంగిపొర్లింది. పత్తి పంటలో నీరు నిలిచింది. మొక్కజొన్న పంటలు నేలకువాలాయి. ఖానాపురం మండలం బుధరావుపేట వద్ద 365 నెంబరు జాతీయ రహదారిపై నిర్మాణంలో బ్రిడ్జిపై నుంచి వరద పొంగింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

గల్లంతు...

నర్సంపేట మండలం గురిజాలలో పెద్ద చెరువు మత్తడి పోస్తోంది. దీంతో గడ్డం అనిల్ అనే యువకుడు వరద ప్రవాహంను బైక్‌తో సహా దాటుతున్న క్రమంలో కొట్టుకుపోయాడు. ఆయన కోసం గ్రామస్థులు గాలిస్తున్నారు. 163వ జాతీయ రహదారి వరంగల్- భూపాలపట్నం రహదారిపై నాలుగు అడుగుల ఎత్తు నుంచి వర్షపు నీరు ప్రవహించగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇదీ చూడండి: pulichintala project: ఏపీ ప్రభుత్వ విప్​ను అడ్డుకున్న రాష్ట్ర పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.