గంజాయి స్మగ్లింగ్ పాల్పడుతున్న ఐదుగురు అంతర్రాష్ట్ర స్మగ్గర్లను వరంగల్ అర్బన్ జిల్లా గీసుకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 50 లక్షల రూపాయల విలువైన 500 కిలోల గంజాయితో పాటు రెండు నాటు తుపాకులు, 11 గుండ్లు, ఒక కత్తి, ఒక బొలేరో వాహనం, ఐదు సెల్‌ఫోన్లు, ఒక కారు, లక్షన్నర నగదు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవిందర్ తెలిపారు. వీరు తెలంగాణతో పాటు మహారాష్ట్ర,మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌కు ఎగుమతి చేసేవారని చెప్పారు.
సుమన్ అనే వ్యక్తి నగరంలో హోటల్ వ్యాపారం నిర్వహిస్తూ... నష్టాల పాలైనట్లు సీపీ తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో విశాఖపట్నంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో అమ్ముతున్నట్లు వివరించారు. దీనికి గానూ విశాఖకు చెందిన నలుగురు వ్యక్తులతో ఒప్పందం చేసుకొని... కీర్తీనగర్లోని తన ఇంటి నుంచి వ్యాపార లావాదేవీలు జరిపేవాడు. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు గంజాయిని ఇంట్లో భద్రపరుస్తుండగా... అదుపులోకి తీసుకున్నట్లు సీపీ తెలిపారు.
ఇదీ చూడండి: సంసారంలో చిచ్చుపెట్టిన మధ్యవర్తి.. భర్త ఆత్మహత్యాయత్నం