కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లిలో మంత్రి సత్యవతి రాఠోడ్ బత్తాయిలు పంపిణీ చేశారు. స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాలలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. బత్తాయిల్లో ఉండే సి-విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుందని మంత్రి అన్నారు. నల్లబెల్లి మండలంలోని 11 వేల కుటుంబాలకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జడ్పీ వైస్ ఛైర్మన్ ఆకుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: యూపీలో ఇద్దరు పూజారుల హత్య- యోగిపై విపక్షాల విమర్శలు