వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే పరకాలలో ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించారని అన్నారు. 11 అభ్యర్థులను ఏకగ్రీవం చేసి... తెరాస సత్తా చాటారని స్పష్టం చేశారు. మిగిలిన 11 స్థానాల్లో తెరాసను గెలిపించి 22 స్థానాలు పూర్తిగా తెరాస వశం చేయడమే ధ్యేయంగా తమ ప్రచారం సాగుతుందని అన్నారు.
ఇదీ చూడండి : 'నోట్లపై లక్షీదేవి ఉంటే 'రూపాయి' చల్లగా ఉంటుంది'