తెరాస కార్యకర్తలు తమపై దాడి చేశారంటూ వరంగల్ గ్రామీణ జిల్లాలో పరకాల పోలీస్స్టేషన్లో భాజపా కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.
పరకాలలోని 22వ వార్డులో భాజపా కార్యకర్తలపై అత్యంత దారుణంగా దాడులు జరుగుతున్నాయని కమలం పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. గులాబీ శ్రేణులు ఇప్పటికైనా దాడులు ఆపాలని ఆ వార్డు భాజపా అభ్యర్థి భద్రయ్య కోరారు. పోలీసులు స్పందించి దాడి చేసినవారిపై కేసు నమోదు చేయాలన్నారు.
ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'