ధాన్యాన్ని కేంద్రానికి తరలించి మూడు వారాలు గడుస్తోన్నా.. కొనుగోలు జరపడం లేదంటూ వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ మార్కెట్ ఎదుట బైఠాయించిన అన్నదాతలు.. వెంటనే కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై 3 గంటలపాటు నిరసన వ్యక్తం చేశారు రైతులు. ముంచుకొస్తున్న వర్షాల వల్ల తాము నష్టపోకుండా అధికారులు కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.
ఇదీ చదవండి: కొవిడ్ నియంత్రణలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్