ETV Bharat / state

Cotton cultivation: పత్తి సాగుకు జై కొడుతోన్న గ్రామీణ రైతాంగం

author img

By

Published : Jun 11, 2021, 10:09 PM IST

వానాకాలం మొదలు కావడంతో రైతులు సాగుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రైతులు.. వరి తర్వాత ప్రధానంగా పత్తి పంటపై ఆసక్తి చూపుతున్నారు. వరుణుడు కరుణించి సాగుకు సహకరిస్తే గతేడాది జరిగిన నష్టాలను ఈ ఏడాది పూడ్చుకుంటామని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 cultivation of cotton
cultivation of cotton

వరంగల్ గ్రామీణ జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తోన్న మోస్తరు నుంచి భారీ వర్షాలతో రైతన్నలు పత్తి సాగుకు జై కొడుతున్నారు. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. ఈసారి వర్షాకాలం ఆరంభంలోనే తెల్ల బంగారం సాగుకు సన్నద్దమయ్యారు. గత ఖరీఫ్​లో 2లక్షల 4వేల ఎకరాల్లో పత్తిని సాగు చేయగా.. రబీలో 2లక్షల 38వేల ఎకరాల పైచిలుకు సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల రైతులు పొలాల్లో విత్తనాలను విత్తే పనిలో తల మునకలయ్యారు. వరుణుడు కరుణించి సాగుకు సహకరిస్తే గతేడాది జరిగిన నష్టాలను ఈ ఏడాది పూడ్చుకుంటామని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: Bhatti: 'ప్రభుత్వ భూముల‌తో సొమ్ము చేసుకునేందుకు కేసీఆర్ కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.