ఫేస్ పెయింటిగ్తో ఆకట్టుకున్న విద్యార్థులు వరంగల్లోని ఎస్వీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో టెక్నో మార్గ్ ఫెస్ట్ కోలాహలంగా సాగుతోంది. టెక్నికల్-నాన్ టెక్నికల్ కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఫేస్ పెయింటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
రోజూ పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు సరదాగా బ్రష్ పట్టి ముఖాలపై కళాఖండాలు ఆవిష్కరించారు. వివిధ కళాకృతులను ముఖాలపై చిత్రీకరించుకుని ముచ్చటపడ్డారు.
నిత్యం చదువులే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.