ప్రజలు నివసించే ప్రాంతాల మధ్య బుధవారం సాయంత్రం డిటోనేటర్లను పేల్చడంతో వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండలో ఓ వ్యక్తి నూతన ఇంటి నిర్మాణానికి తీసిన పిల్లర్ గుంతల్లో బండరాళ్లు వచ్చిపడ్డాయి. ఓ బండ రాయిని తొలగించేందుకు అనధికారికంగా కంప్రెషర్తో డిటోనేటర్లను అమర్చి పేల్చుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
బండ రాళ్లు లేచి పక్కనే ఉన్న ఇళ్లు, రేకులు, కరెంటు స్తంభాలపై పడడం వల్ల పలువురి ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వంద మీటర్ల వరకు బండ రాళ్లు ఎగిసి పడ్డాయి. ఈ ఘటనలో పలువురి ఇళ్లలో టీవీలు, ఫ్యాన్లు, పలువురి ఇళ్లలో రేకులు, గృహోపకరణాలు ధ్వంసమయ్యాయని తెలిపారు.
తమకు నష్టం జరిగిందని పరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఈ ఘటనలో సుమారు 4 లక్షలకుపైగా ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి : 'గీత మా అమ్మాయే.. ఆమె జ్ఞాపకాలతో జీవిస్తున్నాం'