వరంగల్ గ్రామీణజిల్లా వర్ధన్నపేట పరిధిలోని పలు గ్రామాల్లో ఆబ్కారీ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఇల్లంద, దుబ్బతండా, స్వామీ తండా, డీసీ తండాల్లో నిల్వా చేసిన గుడుంబా, బెల్లం పానకం ధ్వంసం చేశారు.
పలువురిపై కేసులు నమోదు చేసిన అధికారులు గుడుంబా స్థావరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.