వరంగల్ గ్రామీణ జిల్లాలో నాటుసారా తయారీ రోజురోజుకు విస్తరిస్తోంది. అధికారులు దాడులు చేస్తున్నా గుడుంబా స్థావరాల నిర్వాహకులను ఏమాత్రం నిలువరించలేకపోతున్నారు. తాజాగా వర్ధన్నపేట మండల పరిధిలోని గుబ్బెడు తండా వద్ద కారులో తరలిస్తున్న 150 కేజీల నల్లబెల్లం, 10 లీటర్ల నాటుసారా, 3కేజీల పటికను అబ్కారీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. ఒకే వారంలో ఇది మూడో ఘటనగా అధికారులు ధ్రువీకరించారు.
ఇవీ చూడండి: లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ఎక్సైజ్ ఎస్ఐ