ETV Bharat / state

'రైతే రాజు... లక్ష్యంగా ప్రభుత్వం అడుగులేస్తోంది'

author img

By

Published : Apr 22, 2021, 6:36 PM IST

రాష్ట్ర ప్రభుత్వం.. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని పరకాల వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ రమేశ్ పేర్కొన్నారు. మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

parkal agriculture market
parkal agriculture market

రాష్ట్ర ప్రభుత్వం.. రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోందని పరకాల వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ రమేశ్ పేర్కొన్నారు. అన్నదాతల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెడుతూ లబ్ధి చేకూరుస్తోందని వివరించారు. వెల్లంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

రైతులు ధాన్యాన్ని తేమ లేకుండా తీసుకురావాలని రమేశ్ వివరించారు. రాష్ట్రంలో.. కొద్దిరోజులుగా వర్షం పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తోన్నందున కవర్లు సమకూర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా రైతు కోఆర్డినేటర్ భిక్షపతి, ఎంపీపీ స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'ఫోన్​ ద్వారా సమాచారమిస్తే.. ఇంటికే వచ్చి కరోనా పరీక్షలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.