వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రారంభించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేమన్నారు. ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి పొందేందుకు నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత, జడ్పీ ఛైర్మెన్ గండ్ర జ్యోతి, స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తదితరలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : వివాహిత అనుమానాస్పద మృతి, అత్తింటివారే చంపారని ఆరోపణ