ETV Bharat / state

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు భారీ ఏర్పాట్లు - 12 నియోజకవర్గాల్లో పోలీసుల గట్టి బందోబస్తు - వరంగల్​లో ఓట్ల లెక్కింపునకు చర్యలు

Votes Counting Arrangements in Joint Warangal District : ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేపటి ఓట్ల లెక్కింపునకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఓటరు తీర్పు వెల్లడికానుండటంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంట నెలకొంది. ఇటు లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

Votes Counting Arrangements Done in Warangal
Elaborate Arrangements Done For Votes Counting
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 2, 2023, 5:44 PM IST

Updated : Dec 2, 2023, 6:25 PM IST

Votes Counting Arrangements in Joint Warangal District : జిల్లా నుంచి అసెంబ్లీకి వెళ్లేదెవరో తెలిసే సమయం సమీపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో రేపటి కౌంటింగ్​కు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. హనుమకొండ జిల్లాల్లో పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపును ఎనుమాముల మార్కెట్​లో 4సీ, 4డీ గోదాములో చేపట్టనున్నారు. పశ్చిమలో మొత్తం 15 మంది బరిలో ఉన్నారు. పరకాల నియోజకవర్గంలో 28మంది పోటీలో ఉన్నారు. రెండు చోట‌్ల ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొననుంది.

రేపే జడ్జిమెంట్ డే- ఎలక్షన్ కౌంటింగ్​కు ఈసీ ఏర్పాట్లు పూర్తి

వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఎనుమామూల మార్కెట్‌లోని 17ఏ, బీ, సీ గోదాముల్లో జరగనుంది. ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. నర్సంపేటలో 16 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా, వర్ధన్నపేటలో 14 మంది, వరంగల్ తూర్పులో 29 మంది బరిలో నిలిచారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ ఉండగా వర్ధన్నపేట నర్సంపేటల్లో బీఆర్ఎశ్, కాంగ్రెస్​ల మధ్య పోటా పోటీ నెలకొంది.

ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రంలోకి ఎప్పుడైనా వెళ్లారా? లోపల ఏం జరుగుతుందో తెలుసా?

జనగామ జిల్లాలోని పాలకుర్తి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజవర్గాల ఓట్ల లెక్కింపు పెంబర్తి విద్యా భారతి ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టనున్నారు. పాలకుర్తిలో మొత్తం 15 మంది అభ్యర్థులు ఉండగా, ఘన్‌పూర్, జనగామల్లో 19మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ మూడు చోట్ల కూడా ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది.

Votes Counting Arrangements Done in Warangal : మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, మహబూబాద్ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో జరపనున్నారు. డోర్నకల్‌లో మొత్తం 14 మంది బరిలో నిలవగా, మహబూబాబాద్‌లో 12 మంది పోటీలో ఉన్నారు. మహబూబూబాద్​లో ముక్కోణపు పోటీ ఉండగా డోర్నకల్​లో బీఆర్ఎస్​, కాంగ్రెస్​ల మధ్య పోటీ నెలకొంది.

అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్ఠానం - ఎమ్మెల్యే అభ్యర్థులంతా హైదరాబాద్‌కు తరలింపు!

భూపాలపల్లి నియోజవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో చేపట్టనున్నారు. భూపాలపల్లిలో మొత్తం 23 మంది బరిలో నిలవగా ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ ఉంది. ములుగు నియోజకవర్గం సంబంధించి ఓట్ల లెక్కింపు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ మీటింగ్ హాల్‌లో చేపట్టనున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 11 మంది పోటీలో ఉండగా బీఆర్ఎస్​, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రశాతంగా సాగేలా పోలీసులు పటిష్ట కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలను అమర్చారు. కేంద్రాల వద్ద ఎల్​ఈడీ తెరలను ఏర్పాటు చేశారు.

తెలంగాణ ప్రజలకు అలర్ట్ - రేపు వైన్ షాపులు, రెస్టారెంట్లు బంద్

Last Updated : Dec 2, 2023, 6:25 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.