వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలో అధికారులు అర్హులకు ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారు. లాటరీ పద్దతి ద్వారా డ్రా తీసి 40 మంది అర్హులకు నిర్మాణం పూర్తయిన ఇండ్లను కేటాయించారు. నిలువ నీడలేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్న రాయపర్తి వాసులకు ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ల కేటాయించడం వల్ల రాయపర్తి వాసులు ఆనందం వ్యక్తం చేశారు.
తమకు ఇళ్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. మంచి రోజు చూసుకుని మంత్రి చేతులమీదుగా గృహప్రవేశం చేయనున్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు