ETV Bharat / state

వరంగల్ రూరల్​​ జిల్లాలో కరోనా కట్టడికి ప్రత్యేక కార్యాచరణ - వరంగల్​లో కరోనా నివారణ చర్యలు

వరంగల్​ రూరల్​ జిల్లాలో పెరుగుతున్న కరోనా వైరస్‌ ఆందోళనకు గురి చేస్తున్నాయి. మూడు నెలల కాలంలో కేవలం 40 కేసులు నమోదు కాగా అయితే ఇరవై రోజుల్లోనే కేసులు 127కు చేరుకోవడం గమనార్హం. వేగంగా పరీక్షలు చేయించేందుకు ర్యాపిడ్‌ కిట్లను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ కృషి చేస్తోందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ డి.శ్రీరాం తెలిపారు. మరి జిల్లాలో కరోనా కట్టిడికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

DMHO Dr Shriram says precautionary measures against corona virus are being taken in rural Warangal
వరంగల్​ జిల్లాలో కరోనా కట్టడికి ప్రత్యేక కార్యాచరణ
author img

By

Published : Jul 22, 2020, 5:26 PM IST

  • జిల్లాలో కేసులు పెరుగుతుండటానికి ప్రధాన కారణం?

జిల్లాలో మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ 30వరకు 40 కేసులు మాత్రమే ఉన్నాయి. ఒక్కసారిగా కేసుల ఉద్ధృతి పెరిగింది. జులై 1 నుంచి 17 వరకు మూడింతల కేసులు పెరిగాయి. 122 కేసులు నమోదయ్యాయి. జిల్లా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించకపోవడం, నిర్లక్ష్యంగా ఉండడం వలనే కేసులు పెరుగుతున్నాయి.

  • కరోనాను కట్టడికి సర్వే, వైద్య శిబిరాలు ఎలా నిర్వహిస్తున్నారు?

విద్యాసంస్థలు తెరిచి లేనందున ఆర్‌బీఎస్‌కే వైద్యబృందాలతో జిల్లాలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. పీహెచ్‌సీ వైద్యులు ఉదయం ఆసుపత్రిలో వైద్య సేవలు అందించి మధ్యాహ్నం గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలకు హాజరవుతున్నారు. జిల్లా కార్యాలయంలో సీజనల్‌ వ్యాధుల నివారణ విభాగం ఏర్పాటు చేసి రోజూ నిర్వహించిన క్యాంపుల వివరాలు సేకరిస్తున్నాం. సర్వే విషయంలో గుర్తించిన ప్రాంతాల్లో నియమించిన సిబ్బందికి కొన్ని ఇళ్లను కేటాయించాం. వీరు 14 రోజులు ప్రతి ఇంటికి వెళ్లి రోగ లక్షణాలు ఉన్నాయా అనే వివరాలు సేకరిస్తారు. వీరు స్థానికులా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చారా అనే వివరాలు నమోదు చేస్తారు. ఆ బృందాలు సేకరించిన వివరాలపై పర్యవేక్షకుడు ర్యాండమ్‌గా తనిఖీ చేస్తారు.

  • ర్యాపిడ్‌ కిట్‌ ద్వారా పరీక్షలు ఎలా చేస్తున్నారు..?

జిల్లాకు వచ్చిన సుమారు వెయ్యి ర్యాపిడ్‌ కిట్లను పీహెచ్‌సీలకు పంపించాం. ల్యాబ్‌ టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చాం. కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లో కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారితో పాటు గర్భిణులకు, ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయిస్తున్నాం. ప్రజలకు అవగాహన లేక అందరు వచ్చి ర్యాపిడ్‌ పరీక్ష చేయాలని వరస కడుతున్నారు. తీవ్రంగా జ్వరం, దగ్గు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి చేస్తే ఉపయోగం ఉంటుంది. సామూహికంగా ర్యాపిడ్‌ పరీక్షలు చేస్తే అసలైన రోగులకు పరీక్షలు చేయలేని పరిస్థితి ఎదురవుతది.

  • కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

పాజిటివ్‌ కేసులున్న ప్రాంతాలను కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా గుర్తించి అక్కడ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు జిల్లాలో 20 కంటెయిన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటూ కట్టడి చేస్తున్నాం. ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. సర్వే వివరాలను కొవిడ్‌-19 అనే ప్రత్యేక రిజిస్టర్‌లో పొందుపరుస్తున్నాం.

  • పాజిటివ్‌ కేసులను ఎలా గుర్తిస్తున్నారు?

డీఎంహెచ్‌వో: మొదటగా జ్వరం, తరువాత దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందిని తెలుసుకుంటారు. అనుమానముంటే వారి వద్ద ఉన్న థర్మల్‌ మీటర్‌తో ఉష్ణోగ్రతను పరిశీలిస్తారు. పల్స్‌ ఆక్సీజన్‌ మీటర్‌లో పల్స్‌, రక్తంలో ఆక్సీజన్‌ వివరాలు చూపిస్తాయి. జ్వరం, దగ్గు ఉండి ఊపిరితిత్తుల సమస్య ఉంటే పీహెచ్‌సీకి.. అక్కడ తగ్గకుంటే శ్వాసకోశ వ్యాధిగా నిర్ధారణ చేసుకొని జిల్లా ఆసుపత్రికి పంపిస్తారు. వీటితో పాటు ఫ్లూ లక్షణాలున్నా ఐసోలేషన్‌ వార్డుకు పంపిస్తాం. నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తాం.

పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు చికిత్స ఎలా అందిస్తారు?

పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి సీరియస్‌గా ఉంటే ఎంజీఎంకు.. ఎలాంటి లక్షణాలు లేకుంటే 17 రోజులు హోం ఐసోలేషన్‌లోనే ఉంచుతాం. మాస్కు, గ్లౌజ్‌, శానిటైజర్‌తో పాటు మందులు ఉన్న కిట్‌ ఇస్తున్నాం. వీరి ఇంటి వద్దకు రోజు రెండు సార్లు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నాం. జిల్లాలో గత శనివారం నాటికి 127 మందిలో 97మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచాం. ఒకటే గది ఉన్న ఇల్లు ఉన్నవారిని ఆసుపత్రి ఐసోలేషన్‌లో ఉంచుతాం.

  • వైరస్‌ వ్యాప్తి చెందకుండా మీరిచ్చే సూచనలు ఏంటీ?

భౌతిక దూరం పాటించాలి. తప్పని సరిగా మాస్కులు ధరించాలి. శానిటైజర్‌ వినియోగించాలి. రద్దీ ప్రదేశాల్లో ఉండరాదు. దుకాణాలు, ఇతర ప్రాంతాల్లో 3 నుంచి 4 మీటర్ల దూరం ఉండే విధంగా దుకాణ యజమానులే ఏర్పాట్లు చేయాలి. అవసరమైతే తప్ప ఇళ్లల్లోనే ఉండేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి.

  • సీజనల్‌ వ్యాధుల నివారణ సంగతేంటీ..?

కరోనాను కట్టడి చేస్తూనే సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. గతేడాది ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకున్నాం. మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశాం. కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా కమిటీ నిత్యం పర్యవేక్షిస్తుంది. ముందే అప్రమత్తంగా ఉండటంతో కేసులు రావడం లేదు. గత సీజన్‌లో 33 మలేరియా, 216 డెంగీ కేసులు నమోదు కాగా ఈ సీజన్‌లో నేటి వరకు 7 మలేరియా, 2 డెంగీ కేసులు నమోదయ్యాయి. గతేడాది గార్ల మండలంలో ఎదురైన తీవ్ర సమస్యను గుర్తుంచుకొని ఈ సారి ముందస్తు చర్యలు తీసుకున్నాం. జూన్‌ 15 నుంచే అక్కడ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం.

  • ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లో ఇప్పటికే 12 వేల దోమ తెరలను పంపిణీ చేశాం. 21 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. అలాగే వైద్య శిబిరాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాం.

ఇదీ చూడండి: ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.