ETV Bharat / state

కూలిపోతున్న కాకతీయ కళా వైభవం... - కూలిపోతున్న ఏకవీర ఆలయం

అది కాకతీయుల నాటి అద్భుత ఆలయం.. రాణి రుద్రమ దేవి ఆరాధ్యదేవత ఏకవీర కొలువైన కోవెల. అద్భుతమైన శిల్ప సంపదతో, ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ ఆలయం... మరికొన్నేళ్లలో ఉండదేమో! వరంగల్‌ గ్రామీణ జిల్లా, గీసుకొండ మండలం మొగిలిచర్లలో ఉన్న కాకతీయుల నాటి ఏకవీర ఆలయం శిథిలావస్థకు చేరింది. ఏమాత్రం భారీ వర్షమొచ్చినా ఆలయం ముందు భాగం కూలిపోయే దుస్థితికి చేరింది.

కూలిపోతున్న కాకతీయ కళా వైభవం...
కూలిపోతున్న కాకతీయ కళా వైభవం...
author img

By

Published : Jan 21, 2021, 10:28 AM IST

వరంగల్‌ గ్రామీణ జిల్లా, గీసుకొండ మండలం మొగిలిచర్లలో ఉన్న కాకతీయుల నాటి ఏకవీర ఆలయం శిథిలావస్థకు చేరింది. కాకతీయుల శిల్ప వైభవం కూలిపోయే దశకు చేరినా అధికారులకు ఏ మాత్రం పట్టడం లేదు. ఆలయానికి గతంలోనే డబ్బులు మంజూరైనట్టు గ్రామస్థులు చెబుతున్నా, ఆ నిధులు ఎటెళ్లాయో తెలియడం లేదు. క్రీ.శ. 1208లో ఏకవీర ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. నాడు ఈ ఆలయం సమీపంలో సైన్యానికి యుద్ధ విద్యలు నేర్పే స్థావరం కూడా ఉండేది. ఇక్కడి నుంచి వరంగల్‌ కోట వరకు రహస్య సొరంగం ఉండేదని చరిత్ర కారులు చెబుతున్నారు. సుమారు 25 స్తంభాలతో అద్భుతంగా నిర్మించిన ఈ ఆలయం మాత్రం ఇప్పుడు పూర్తి శిథిలావస్థకు చేరింది.

కూలిపోతున్న కాకతీయ కళా వైభవం...
కూలిపోతున్న కాకతీయ కళా వైభవం...

పట్టించుకోని అధికారులు

ఆలయంలో గుప్త నిధులున్నాయని గతంలో కొందరు గర్భగుడి ముందున్న మండపాన్ని పగులగొట్టి తవ్వకాలు జరపడం వల్ల ఆలయం పునాది దెబ్బతిన్నది. ముందు భాగంలో స్తంభాలన్నీ ఒరిగిపోయాయి. ఈ విషయం రాష్ట్ర పురావస్తు శాఖ అధికారుల దృష్టికెళ్లినా... ఆలయాన్ని కాపాడతామంటూ నాలుగేళ్ల కిందట ఓ బోర్డు ఏర్పాటు చేసి.. స్తంభాలకు ఊతంగా ఇసుక బస్తాలు పెట్టి చేతులు దులుపుకున్నారు.

కూలిపోతున్న కాకతీయ కళా వైభవం...
కూలిపోతున్న కాకతీయ కళా వైభవం...

విడుదల కాని నిధులు...

ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వ జాప్యంతో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో 13వ ఫైనాన్స్‌ కింద రూ.40 లక్షలు మంజూరయ్యాయని.. నిధులు విడుదల కానందున పనులు మొదలుపెట్టలేదని... ఇసుక బస్తాలు ఊతంగా పెట్టడానికి రూ. 40 వేలు వెచ్చించామని ప్రభుత్వం నుంచి జవాబు వచ్చింది.

కూలిపోతున్న కాకతీయ కళా వైభవం...
కూలిపోతున్న కాకతీయ కళా వైభవం...

ఇప్పటికైనా స్పందించండి

2016లో స్తంభాలకు ఊతంగా వేసిన ఇసుక బస్తాలు కూడా ఇప్పుడు కుంగిపోయి దెబ్బతిన్నాయి. ఆలయం ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. పైగా ఈ చారిత్రక గుడి వద్దకు వెళ్లేందుకు కనీసం బాట కూడా లేదు. ఇప్పటికైనా ఈ ఆలయంపై దృష్టి సారిస్తే నాటి కాకతీయ కళా వైభవం నేటి తరాలకు కనువిందు చేస్తుంది.

కూలిపోతున్న కాకతీయ కళా వైభవం...
కూలిపోతున్న కాకతీయ కళా వైభవం...

ఇదీ చూడండి: గొంతుతో రకరకాల బీట్లు.. వింటే ఔరా అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.