ETV Bharat / state

పర్వతగిరి సీఐ కిషన్​కు పోలీస్ బాస్ ప్రశంసలు - dgp mahender reddy tweet

గవిచర్ల జీపు ప్రమాదంలో ప్రయాణికుల ప్రాణాలు రక్షించడానికి పోలీసులు చేపట్టిన తక్షణ చర్యలను డీజీపీ మహేందర్ రెడ్డి ప్రశంసించారు. ప్రయాణికులను రక్షించిన తీరు పోలీసు సిబ్బంది నిబద్ధతకు అద్దం పట్టిందని కొనియాడారు.

parwathagiri ci kishan on jeep accident
పర్వతగిరి సీఐ కిషన్​కు పోలీస్ బాస్ ప్రశంసలు
author img

By

Published : Oct 29, 2020, 10:06 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామ శివారులో మంగళవారం జరిగిన జీపు ప్రమాదంలో తక్షణ చర్యలు చేపట్టిన పర్వతగిరి సర్కిల్​ ఇన్​స్పెక్టర్​ కిషన్​ను డీజీపీ మహేందర్ రెడ్డి ప్రశంసించారు. బావిలో పడిన ప్రయాణికులను రక్షించిన తీరు పోలీసుల నిబద్ధతకు అద్దం పట్టిందని కొనియాడారు.

కటిక చీకటిని కూడా లెక్కచేయకుండా రాత్రంతా శ్రమించిన సీఐ కిషన్ సహా పోలీస్ సిబ్బందిని ట్విట్టర్ ద్వారా డీజీపీ అభినందించారు. జీపు ఘటనలో శ్రమించిన పోలీసు సిబ్బందిని వరంగల్ సీపీ ప్రశంసించారు. పోలీసులు తీసుకున్న చర్యల వల్ల అధిక ప్రాణనష్టాన్ని నివారించడం జరిగిందని అభిప్రాయపడ్డారు. రాత్రంతా శ్రమించి ప్రయాణికులను రక్షించిన పోలీసులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.