ETV Bharat / state

దేవాదుల కాలువ ప్రారంభం... రైతుల ముఖాల్లో ఆనందం

15 ఏళ్లుగా నిర్మాణానికి నోచుకోని కాలువ... ఈ రోజు ఏకంగా నీటితో కళకళలాడుతూ రైతుల ముఖాల్లో వెలుగులు నింపింది. వరంగల్​ రూరల్​ జిల్లాలోని దేవాదుల కాలువను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ కాలువ ద్వారా పరకాల, స్టేషన్​ ఘన్​పూర్​ నియోజక వర్గాలు లాభపడనున్నాయి.

దేవాదుల కాలువ ప్రారంభం... రైతుల ముఖాల్లో ఆనందం
devadula river water started in parakala
author img

By

Published : May 14, 2020, 12:14 PM IST

వరంగల్​ రూరల్​ జిల్లా పరకాల నియోజకవర్గంలోని ధర్మసాగర్ రిజర్వాయర్​లోకి వచ్చే దేవాదుల కాలువను పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్​, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

ఈ కాలువ నీటి ద్వారా పరకాల, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్​పూర్ నియోజకవర్గాల్లో 91 వేల 700 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. పరకాల నియోజకవర్గంలో 37వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందనుంది. 15 ఏళ్లుగా కాలువ నిర్మాణం నోచుకోని తరుణంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్థానిక రైతులను సమన్వయం చేస్తూ, లాక్​డౌన్ కాలంలో అధికారులను సమాయత్తం చేసి అన్ని తానై అహర్నిశలు కృషి చేశారని మంత్రి కొనియాడారు. దేవాదుల నీరు చూసి రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: 'మిగులు జలాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.