వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పట్టాదారు పాసు పుస్తకాలు లేకుండా అధికారులు పంట కొనుగోలు చేయడం లేదు.
పట్టాదారు పాసుపుస్తకాల కోసం చెప్పులరిగేలా తిరిగినా లాభం లేకపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పండిన పంటను అమ్ముకుందామంటే పాసుపుస్తకం లేకుండా కొనుగోలు జరపడం లేదని వాపోయారు.
కౌలు ఇచ్చిన వ్యక్తి భూమికి పట్టాదారు పాసుపుస్తకం లేకపోవడం వల్ల కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఏం చేయాలో తెలియక కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తమ పంటను కొనుగోలు చేయాలని కౌలు రైతులు అధికారులను వేడుకుంటున్నారు.
- ఇవీ చూడండి : గడ్డి అన్నారంలో కార్పొరేటర్ అనుచరుల వీరంగం