వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణ శివారులోని కాకతీయ నగర్లో గుడిసెలను తగలబెట్టి.. గుడిసెవాసులపై దాడులు చేయడం అత్యంత పాశవిక చర్య అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య అన్నారు. కాలిన గుడిసెలను సందర్శించి.. క్షతగాత్రులను పరామర్శించారు.
" మూడు రోజుల క్రితం సీపీఎం గుడిసెలపై పోలెబోయిన వెంకటయ్య అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి 40మంది అనుచరులతో వచ్చి పెట్రోల్‌తో తగలబెట్టారు. గుడిసెవాసులపై కర్రలతో దాడి చేశారు. మహిళలనీ చూడకుండా అత్యంత దారుణంగా కొట్టారు. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. 601సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలి"
-నాగయ్య, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
మహిళలపై గూండాలు ఇష్టారీతిన దాడి చేశారని.. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి డిమాండ్ చేశారు. గుడిసెవాసులకు పట్టాలు ఇచ్చేంతవరకు ఎంతటి ఉద్యమానికైనా వారితో తోడు ఉంటామని ఆమె అన్నారు.
ఇదీ చూడండి: ఉద్యమంతో సంబంధంలేని వాళ్లు కూడా బెదిరిస్తున్నారు: ఈటల