వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్ సమ్మక్క-సారలమ్మ జాతర బందోబస్తు ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ వి. రవీందర్ పరిశీలించారు.
వచ్చే నెల 5 నుంచి 8 వరకు జరిగే జాతరలో క్యూలైన్ల నిర్మాణం, పార్కింగ్ స్థలాలు, సీసీ కెమెరాల పనులను పర్యవేక్షించారు. పోలీస్, దేవాదాయ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో చర్చించారు. అనంతరం అమ్మవార్లకు మొక్కులను చెల్లించుకున్నారు.
ఇదీ చూడండి : మంత్రి గంగుల నిబంధన ఉల్లంఘించారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు