వరంగల్ గ్రామీణ జిల్లాలో కొవిడ్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హరిత వైద్యులకు సూచించారు. బాధితులకు అందుబాటులో ఉంటూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. వర్ధన్నపేట, రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
ఆస్పత్రి ప్రాంగణం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. ఆస్పత్రి నిర్వహణ, వైద్యులపై బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'ఉ.10 గంటల తర్వాత బయటకు వచ్చేవారి వాహనాలు స్వాధీనం'