వరంగల్ గ్రామీణ జిల్లా దామెర మండలంలో కలెక్టర్ హరిత ఆకస్మిక తనిఖీ చేశారు. డంపింగ్ యార్డు, శ్మశానవాటిక నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని లేకపోతే సర్పంచ్, ఉపసర్పంచ్‌పై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిత హెచ్చరించారు. దామెరతో పాటు ల్యాదళ్ల, సింగరాజుపల్లి గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల కేంద్రం రహదారి వెంబడి హరితహారానికి తీస్తున్న గుంతలను, శ్మశానవాటికలు నిర్మిస్తున్న స్థలాన్ని ఆమె పరిశీలించారు.
గ్రామంలో రహదారి మధ్యలో డ్రైనేజీల నుంచి పొంగుతున్న మురుగునీటిని శుభ్రం చేయాలని సర్పంచ్‌కు సూచించారు. ల్యాదళ్లలో నర్సరీని పరిశీలించేందుకు కలెక్టర్ వెళ్లారు. అక్కడ దారిలో నీరు నిలిచిపోవడం, బురదమయంగా మారడం చూసి ఆమె అసహనం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేయబోతున్న హరితపార్కు స్థలం వివాదంలో ఉందని తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం స్థలాన్ని అందజేయాలని తహశీల్దార్‌ను ఆదేశించారు.
ఇదీ చదవండి:ఆడుకున్న ఇంటిని కూల్చేశారు.. ఆడించిన నాన్నను చంపేశారు!