ETV Bharat / state

'విద్వేష రాజకీయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి'

విద్వేష రాజకీయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. దేశ భవిష్యత్ ప్రజల చేతుల్లోనే ఉందన్న సీఎం.. దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దుకునే కర్తవ్యం యువతపైనే ఉందన్నారు. ఆరోగ్య రంగంలో రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తోందన్న కేసీఆర్​ ప్రతి జిల్లాలోనూ ఓ వైద్య కళాశాల నెలకొల్పుతున్నామని చెప్పారు. వరంగల్ హెల్త్ సిటీ త్వరలోనే పూర్తవుతుందన్న కేసీఆర్​.. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వైద్యం కోసం వచ్చే పరిస్థితి వస్తుందన్నారు.

KCR Warangal Tour
KCR Warangal Tour
author img

By

Published : Oct 1, 2022, 8:51 PM IST

విద్వేష రాజకీయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి

ఒక రోజు పర్యటన కోసం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో హనుమకొండకు విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్​.. దామెర క్రాస్​ రోడ్డు వద్ద ప్రతిమా క్యాన్సర్ ఆసుపత్రి, వైద్య కళాశాలలను ప్రారంభించారు . మంత్రులు హరీశ్​రావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, గంగుల కమాలకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రం వివక్షతో ఒక్క వైద్య కళాశాల మంజూరుచేయపోయినా.. దూరదృష్టితో వైద్య విద్య కోసం రష్యా,ఉక్రెయిన్‌, చైనా పోయే బాధలు తప్పించామని వివరించారు.

ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టులు తయారు చేశామన్న సీఎం త్వరలో 119 నియోజకవర్గాల్లోనూ చేపడతామన్నారు. అత్యాధునిక వసతులతో వరంగల్‌లో నిర్మించ బోయే సూపర్ స్పెషాలిటీ రాష్ట్రానికే తలమానికంగా మారనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం కొందరు విషబీజాలు నాటుతున్నారని తెరాస అధినేత వ్యాఖ్యానించారు.

జాతీయ రాజకీయ పరిస్థితులు, రావాల్సిన మార్పులపై కేసీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అద్భుత వనరులతో గొప్ప సహనశీల దేశం కొందరి స్వార్థరాజకీయాలతో వెనకబడి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారినపుడే దేశ పురోగతి సాధ్యమని పునరుద్ఘాటించారు . దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ కాన్వాయ్ వెళ్తున్న క్రమంలో తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్డు పక్కన నిల్చొని వీఆర్​ఏలు ప్లకార్డులను ప్రదర్శించారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి వారిని పిలిచి మాట్లాడారు.

"సహనంతోని అందరిని కలుపుకొనిపోయే దేశం. కొందరు దుర్మార్గులు వాళ్ల స్వార్థ నీచప్రయోజనాల కోసం విషబీజాలు నాటే ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఏరకంగా సమర్ధనీయం కాదు. భవిష్యత్ మీది భారతదేశం మీది. ఈ దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దుకునే కర్తవ్యం మీ మీద ఉన్నది. మన పురోగమనంలో సమాజం చైతన్యవంతమై ఉండాలి. ఏసమాజమైనా నిద్రాణమై ఏమరపాటుగా ఉంటే చాలా ఇబ్బందులు తప్పవు. మన రాష్ట్రంలో మనం పడ్డ బాధలే ఉదాహరణ. ఇన్ని వనరులు వసతులు ఉన్న భారతదేశం వచించబడుతుంది. తద్వారా భారతదేశం అవకాశాలు కోల్పోతుంది." -కేసీఆర్ ముఖ్యమంత్రి

ఇవీ చదవండి: బిజినెస్‌లో లీడర్​షిప్‌ క్వాలిటీస్​ చాలా ముఖ్యం: గవర్నర్

కేదార్​నాథ్​లో భారీ హిమపాతం.. ఒక్కసారిగా విరిగిపడ్డ మంచు పెళ్లలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.