అనారోగ్యానికి గురై ఆరోగ్యశ్రీ వర్తించని వ్యాధులతో బాధపడుతున్న 96 మంది బాధితులకు వరంగల్ రూరల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. శనివారం హన్మకొండలోని వారి నివాసంలో మొత్తం 96 మందికి గాను రూ.32 లక్షల 64 వేలు విలువచేసే చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
పరకాల మున్సిపాలిటీలో 11, పరకాల మండలంలో 6, నడికూడ మండలంలో 9, దామెర మండలంలో 11, ఆత్మకూరు మండలంలో 15, గీసుగొండ మండలంలో 21, సంగెం మండలంలో 17, ఇతరులకు 6 మొత్తం 96 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను అందించారు.
ఇదీ చూడండి : భాజపా రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్