ETV Bharat / state

'పౌరసత్వ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి' - latest news on bjp ragunandan rao

వరంగల్​ రూరల్​ జిల్లాలోని ఓ ఫంక్షన్​ హాల్లో భాజపా కార్యకర్తలకు పౌరసత్వ సవరణ చట్టంపై వర్క్​షాప్​ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్​రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Citizenship law should be made more public
'పౌరసత్వ చట్టంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి'
author img

By

Published : Jan 7, 2020, 11:16 AM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎదుగుదలను ఓర్వలేక పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్​, తెరాస, వామపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునంధన్​ రావు పిలుపునిచ్చారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో పౌరసత్వ సవరణ చట్టంపై భాజపా కార్యకర్తలకు నిర్వహించిన వర్క్​షాప్​లో ఆయన పాల్గొన్నారు.

పౌరసత్వ సవరణ చట్టంపై పూర్తి అవగాహన లేకే పలు పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. కార్యకర్తలు ఈ చట్టంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఫంక్షన్ హాలు నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి రఘునందన్​రావు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర నాయకులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

'పౌరసత్వ చట్టంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి'

ఇదీ చూడండి: "ఎన్నికల సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి"

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.