జన ఆశీర్వాద యాత్రలో భాగంగా వరంగల్... హనుమకొండ జిల్లాలకు విచ్చేసిన కేంద్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కాషాయ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆయన రాకను పురస్కరించుకొని నాయుడు పెట్రోల్ పంప్ వద్ద పార్టీ కార్యకర్తలు బాణా సంచా కాల్చి సందడి చేశారు. నాయుడు పెట్రోల్ పంప్ నుంచి రంగశాయిపేట, పోస్ట్ ఆఫీస్ మీదుగా నగరంలోని పలు కూడళ్ల గుండా జన ఆశీర్వాద యాత్ర సాగింది. కార్యకర్తలు బైక్ ర్యాలీతో కూడా నిర్వహించారు.
వరంగల్లోని సి.కే.ఎం ఆసుపత్రిని కేంద్ర మంత్రి సందర్శించి టీకాల పంపిణీ పై వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించి రుద్రేశ్వరునికి పూజలు చేశారు.
ఇదీ చదవండి: Justice NV Ramana: ఆర్బిట్రేషన్ ఏర్పాటుకు సహకరించిన అందరికి ధన్యవాదాలు