వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణం ముదిరాజ్‌వాడ సగర వీధి, మెయిన్ వద్ద పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. 50 మంది సిబ్బంది, ఇద్దరు ఎస్సైలు, సీఐ కార్డెన్ సెర్చ్‌లో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 54 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజల్లో పోలీసు వ్యవస్థపై భయం పోగొట్టేందుకు, నేర భావజాలాన్ని అరికట్టేందుకు నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు పరకాల ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చూడండి: కూతురు పెళ్లికోసం దాచిన బంగారం ఎత్తుకెళ్తున్న దొంగకు దేహశుద్ధి