వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలోని ఆకేరు వాగుపై వంతెన నిర్మాణానికి రంగం సిద్ధమైంది. స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో అధికారులు మంతనాలు జరిపారు. అధికారులతో కలిసి ఎమ్మెల్యే వంతెన నిర్మాణం జరిపే ప్రాంతాన్ని సందర్శించారు.
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు. ఆకేరు వాగుపై వంతెన నిర్మాణానికి అధికార యంత్రాంగం కదలడం వల్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: గ్రేటర్లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు