ETV Bharat / state

డబ్బులు పంచుతున్నారని భాజపా ఆందోళన - వరంగల్​ రూరల్​ జిల్లా తాజా వార్తలు

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్​లో తెరాస నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలంలో భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీ వారు టెంట్​ వేసి మద్యం, డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు.

bjp leaders protest at duggondi in warangal rural district
డబ్బులు పంచుతున్నారని భాజపా ఆందోళన
author img

By

Published : Mar 14, 2021, 3:52 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలంలో భాజపా నాయకులు ధర్నా చేపట్టారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్​లో తెరాస నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ వారు పోలింగ్​ కేంద్రం సమీపంలో టెంట్​ వేసి మద్యం, డబ్బులు పంచుతున్నారని చెప్పారు.

ఓటర్లను ప్రలోభపెడుతున్నారని.. రిటర్నింగ్​ అధికారి వచ్చి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. స్థానిక ఎస్సై ఆందోళనకారులతో మాట్లాడి.. ధర్నా విరమింపజేశారు.

ఇదీ చదవండి: 'నేను కేసీఆర్​ను కలవలేదు... తప్పుడు ప్రచారమన్న కోదండరాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.