అన్యాక్రాంతం అవుతున్న చెరువును కాపాడాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు భాజపా నాయకులు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ హరితకు తమ ఊరి చెరువు భూమి ఆక్రమణకు గురైందని సర్వే నెంబర్ల వివరాలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.
చెరువు భూమిని సంరక్షించి హద్దులు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని గ్రామ భాజపా నాయకులు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు స్వీకరించిన కలెక్టర్.. వెంటనే వర్ధన్నపేట తహసీల్దార్ భాస్కర్‌ను చెరువు ఆక్రమణలపై విచారణ జరిపి వివరాలు అందివ్వాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన పువ్వాడ