వరంగల్ గ్రామీణ జిల్లా, ఖానాపురం మండలం పాకాల అభయారణ్యంలో అటవీ శాఖ అధికారులు ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బర్డ్స్ వాక్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి పురుషోత్తంతో పాటు ఇతర అధికారులు, పర్యావరణవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం ప్రతి ఏడాది మే 11, అక్టోబర్ 12న రెండుసార్లు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలస పక్షులు నీటి కోసం, ఆహారం కోసం ఖండాంతరాలు దాటి వస్తున్నాయని జిల్లా అటవీశాఖాధికారి పురుషోత్తం తెలిపారు.
ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన సరస్సుల్లో పాకాల ఒకటి. ప్రతి సంవత్సరం ఇక్కడికి రెండు వందలకు పైగా పక్షులు, జంతువులు, సరీసృపాలు వస్తుంటాయి. ఎండకాలంలో ఆవాసంగా ఏర్పర్చుకుంటాయి.
ఇవీ చూడండి:'స్థానిక' అభ్యర్థుల కోసం గులాబీ కసరత్తు