Prime Minister Narendra Modi Warangal Tour : తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి రైల్వే వ్యాగన్ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. కాజీపేట్‌లో ఏర్పాటు అయ్యే ఈ వ్యాగన్ యూనిట్ వల్ల పరిసర ప్రాంతాలు అభివృద్ది చెందే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1200 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాగాన్ల ఉత్పత్తి యూనిట్‌ను లాంఛనంగా శంకుస్థాపన చేస్తారని ఆయన ప్రకటించారు. కాజీపేట సమీపంలోని అయోధ్యపురం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జీఎం అరుణ్ కుమార్ జైన్ వ్యాగన్ ఉత్పత్తి యూనిట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగు వ్యాగన్ల ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయని.. ఐదోది వరంగల్ కాజీపేటలోని అయోధ్యపురంలో రాబోతుందన్నారు. 160 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.521 కోట్ల అంచనా వ్యయంతో వ్యాగన్ల ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. గతంలో పిరియాడికల్ ఓవరాలిక్ యూనిట్‌ను అప్ గ్రేడ్ చేస్తూ, వ్యాగన్ ఉత్పత్తిని కూడా ప్రారంభిస్తామన్నారు. దీనికి గతంలో ఉన్న టెండరే కొనసాగుతుందని, సప్లమెంటరీ టెండర్ కూడా ఉంటుందని తెలిపారు. ఇక్కడ అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రోబోటిక్ పెయిటింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. ఈ యూనిట్‌లో కంప్యూటరైజ్డ్ మిషన్లు వినియోగిస్తామన్నారు. ఇక్కడ అన్ని రకాల రోలింగ్ స్టాక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.
- Modi Tour in Telangana : జులై 8న వరంగల్‌కు ప్రధాని.. రూ.6,050 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
- Threatening Letter to SCR : త్వరలో మరోఘోర రైలు ప్రమాదం.. ద.మ.రైల్వేకు బెదిరింపు లేఖ
Railway Wagon Production Units Uses : ఫిబ్రవరి 2025లోపు మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. భారతీయ రైల్వే 2027 నాటికి 3 వేల మిలియన్ టన్నుల సరకు రవాణా చేయాలనే లక్ష్యంతో ఉందన్నారు. కానీ.. ప్రస్తుతం 1,650 మిలియన్ టన్నుల సరకు రవాణా మాత్రమే చేస్తున్నామన్నారు. దీనికి ప్రధాన కారణం వ్యాగన్‌ల కొరతే అని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఇక్కడ వ్యాగన్ల ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ కోసం ఇంకా టెండర్లు పిలవలేదని అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.
Narendra Modi Warangal Tour Schedule : ప్రధాని పర్యటనలో భాగంగా రైల్వే వ్యాగన్ ప్రాజెక్టుతో పాటు రూ.5 వేల 550 కోట్ల విలువైన పలు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల మధ్య 68 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. మంచిర్యాల-వరంగల్ మధ్య జాతీయ రహదారికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. దీని కోసం బీజేపీ నాయకులు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ నుంచి.. అధిక సంఖ్యలో జన సమీకరణ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
- 50పైసల కన్నా తక్కువ పేమెంట్‌తో రూ.10 లక్షల బీమా.. రైల్వే ఇన్సూరెన్స్ గురించి తెలుసా?
- Organizational Changes in Telangana BJP : అసంతృప్తులు వీడి.. అలకలు వీడేలా రాష్ట్ర బీజేపీ కార్యాచరణ
- Rahul Gandhi Khammam Meeting Speech : 'బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధుత్వ పార్టీ.. కేసీఆర్ రిమోట్ ప్రధాని మోదీ చేతుల్లో ఉంది'