రైతులకు రుణాల మంజూరులో డీసీసీబీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అభిప్రాయపడ్డారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి రైతన్నలు ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. వరంగల్ గ్రామీణ జిల్లా డీసీసీ బ్యాంక్ వర్ధన్నపేట అధ్వర్యంలో.. 76 మంది లబ్ధిదారులకు రూ. 3కోట్ల 86 లక్షల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
రైతన్నలు అధిక వడ్డీలు తెచ్చి పంటలు సాగు చేయడం వల్ల అప్పుల భారం పెరుగుతుందన్న ఆయన.. డీసీసీబీ నుంచి పొందే రుణాలు అతి తక్కువ వడ్డీ రేటుతో అందిస్తుందని తెలిపారు. తెరాస పాలనలో బ్యాంకుల నిర్వహణ పారదర్శకంగా ఉందని.. సకాలంలో రుణాలు చెల్లించి అభివృద్ధి బాటలో ముందుకెళ్లాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: అదుపు తప్పిన బైక్.. ఓ విద్యార్థి మృతి