వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో పత్తి కొనుగోలు కేంద్రంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ మోగిలి హాజరయ్యారు. రైతును రాజును చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక రచించి ముందుకు సాగుతోందని మోగిలి అన్నారు.
5855 రూపాయల ప్రభుత్వ మద్దతు ధరకే రైతులు పత్తిని అమ్ముకోవాలని కోరారు. మధ్యవర్తులను నమ్మి రైతులు మోసపోవద్దని... ప్రభుత్వ ఆమోదిత కాంటాలలోనే పత్తిని అమ్మి లాభపడాలని సూచించారు. రైతులు కూడా సేకరించిన పత్తిని తేమ లేకుండా తెచ్చి కష్టాల భారం నుంచి బయట పడాలని కోరారు.