వరంగల్ రూరల్ జిల్లాలో సాంకేతిక అంశాలపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జాగృతి పోలీస్ కళాబృందం సభ్యులు సూచించారు. శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో జాగృతి పోలీస్ కళాజాత బృందం వరంగల్ సీపీ విశ్వనాథ రవీందర్ ఆదేశాల మేరకు వివిధ అంశాలపై 8 మంది సభ్యులు కళాజాత నిర్వహించారు.
ఈ సందర్భంగా అక్షరాస్యత, డయల్ 100, మూఢ నమ్మకాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మద్యం మత్తులో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచించారు.