ETV Bharat / state

ఎల్లలు దాటిన ప్రేమ.. హనుమకొండ అబ్బాయి.. అమెరికా అమ్మాయి.. - హనుమకొండ జిల్లా తాజా వార్తలు

Love marriage: ప్రేమకు కులం, మతం, ప్రాంతం హద్దులు కావని మరోసారి నిరూపించింది ఆ జంట. ఖండాంతరాలు దాటి.. ఆ ఇద్దరు తమ ప్రేమను గెలిపించుకున్నారు. హనుమకొండ జిల్లాకు చెందిన అరవింద్ రెడ్డి , అమెరికాకు చెందిన జెన్న బ్లెమర్ ..పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు.

Love marriage
Love marriage
author img

By

Published : Jul 31, 2022, 8:12 PM IST

ఎల్లలు దాటిన ప్రేమ.. హనుమకొండ అబ్బాయి.. అమెరికా అమ్మాయి..

Love marriage: హనుమకొండ జిల్లాకు చెందిన అరవింద్​రెడ్డి, అమెరికాకు చెందిన జెన్న బ్లెమర్ వివాహం ఘనంగా జరిగింది. ఖండాలు దాటిన వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడంతో వీరి ప్రేమ పెళ్లిపీటలు ఎక్కింది. హనుమకొండకు చెందిన పుట్ట అనిత మోహన్ రెడ్డి దంపతుల కుమారుడు అరవింద్ రెడ్డిపై చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. అక్కడ డాక్టర్ జెన్న బ్లెమర్ పరిచయం అయింది. ఆనంతరం ఒకరికి ఒకరు ఇష్టపడ్డారు.

ఈ విషయాన్ని ఇరువురు తల్లిదండ్రులకు చెప్పగా వారు అంగీకరించారు. హనుమకొండలో జరిగిన వీరి వివాహానికి పలువురు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. పెళ్లిలో తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులు ధరించిన జెన్న బ్లెమర్... ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అరవింద్ రెడ్డిని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని జెన్న బ్లెమర్ తెలిపింది.

ఇవీ చదవండి: ఆర్జీయూకేటీలో కొనసాగుతోన్న విద్యార్థుల ఆందోళన.. ఎంపీ అడ్డగింత

'హక్కులు, విధులపై అవగాహనతోనే రాజ్యాంగబద్ధ అభివృద్ధి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.