ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన భాజపా పట్టభద్రుల ఆత్మీయ సమావేశానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో తెరాసకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారన్నారు. గడిచినా ఏడేళ్లలో తెరాస ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది శూన్యమని వ్యాఖ్యానించారు. పట్టభద్రులు సీఎం కేసీఆర్ అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకు బలమివ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: శివుడి నివాసం ఎలా ఉంటుంది?