New Birds in Pakala Sanctuary: వరంగల్ జిల్లాలోని పాకాల అభయారణ్యంలో 70 రకాల కొత్త పక్షులను గుర్తించినట్లు డీఎఫ్‌వో అర్పణశ్యాల్ ఆదివారం వెల్లడించారు. రెండు రోజులుగా నిర్వహించిన బర్డ్ వాక్, పక్షుల గుర్తింపు ప్రక్రియ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
స్థానిక, వలస పక్షుల్లో కొత్తవి 70 రకాలున్నట్లు గుర్తించామని డీఎఫ్‌వో పేర్కొన్నారు. ఇప్పటివరకు అభయారణ్యంలో 250 నుంచి 300 రకాల పక్షులు ఉన్నాయని తెలిపారు. అనంతరం ఫొటోగ్రాఫర్లకు ఆమె ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో రమేశ్, డీఆర్వో మోహన్, ఫొటోగ్రాఫర్లు నాగేశ్వర్, వజ్రేశ్వరి, కల్యాణి, సేతురాం, సిబ్బంది, సైనిక్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రతి యేటా విదేశాల నుంచి కొన్ని రకాల పక్షులు గుంపులుగా రాష్ట్రానికి వస్తుంటాయి. కొన్ని నెలల వరకూ వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ గూడు ఏర్పరచుకుంటాయి. నీటి వసతి, ఆహారాన్ని వెతుక్కుంటాయి. పంటపొలాల్లో సైతం సంచరిస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. అనంతరం మళ్లీ స్వదేశాలకు తరలివెళ్తాయి.
ఇదీ చదవండి: రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. వేసవి కాలం ప్రారంభమైందా?